By Shanmukha Vitta
నీ సమక్షం లో,
సమాజం విసిరిన బరువులు అన్నీ కూడా అర్దం కోల్పోతాయి,
నీ సమక్షం లో,
ప్రపంచం చెప్పిన నియమాలు నిశ్శబ్ధాలు అయిపోతాయి,
నీ సమక్షం లో,
నా ప్రాణం సహనంతో నవ్వుతుంది,
నీ సమక్షం లో,
మనసులో ఉన్న భయాలు బలహీన పడిపోతాయి
నీ సమక్షం లో,
ప్రతి పగలు కొత్త ప్రారంభంగా అనిపిస్తుంది
నీ సమక్షం లో,
నేను నాతో దగ్గర అవుతునట్టు అనిపిస్తుంది
నీ సమక్షం లో,
ఎప్పటికి ఇలానే ఉండాలి అని మనసు కోరుతుంది
By Shanmukha Vitta
Comments